కమ్మ సామాజికవర్గానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్
- జెట్టి కుసుమకుమార్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన రాహుల్
- ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న రేవంత్, పొన్నం
- మూడుకు పెరిగిన వర్కింగ్ ప్రెసిడెంట్ల సంఖ్య
ఈ నేపథ్యంలో, బుజ్జగింపుల్లో భాగంగా, ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఆ సామాజికవర్గానికి ఒక పదవిని కట్టబెట్టింది. జెట్టి కుసుమకుమార్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నియమించారు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డిలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. తాజాగా కుసుమకుమార్ నియామకంతో వర్కింగ్ ప్రెసిడెంట్ ల సంఖ్య మూడుకు చేరుకుంది.