'సైరా' విషయంలోనూ నయన్ అంతే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సైరా' విషయంలోనూ నయన్ అంతే!

  • తమిళనాట స్టార్ హీరోయిన్ నయన్ 
  • స్టార్ హీరోలతో సమానంగా వసూళ్లు 
  • తెలుగులో అడపాదడపా మాత్రమే
తమిళనాట లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న కథానాయికగా నయనతార కనిపిస్తుంది. తమిళంలో వరుస సినిమాలు .. వరుస విజయాలు ఆమె స్థాయిని అంతకంతకూ పెంచేస్తున్నాయి. ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి స్టార్ హీరోల సినిమాల స్థాయిలో కాసుల వర్షం కురుస్తుండటం విశేషం. అంత బిజీగా ఉండటం వల్లనే ఆమె తెలుగు సినిమాలు తగ్గించేసింది. వెంకటేశ్ .. బాలకృష్ణ .. చిరంజీవి స్థాయి సినిమాలకే ఆమె ఓకే చెబుతోంది.

'సైరా'లో చేయడానికి నయన్ అంగీకరించినా, ఆమె ఇచ్చిన డేట్స్ తక్కువేనట. ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్ కోసం ఆమె ఇచ్చిన డేట్స్ 3 రోజులేనట. ఈ మూడు రోజుల్లోనే ఆమె కాంబినేషన్ సీన్స్ కానిచ్చేయాలి. లేదంటే మళ్లీ ఆమె డేట్స్ ఎప్పటికో గాని లేవట. అందువలన సురేందర్ రెడ్డి ఆమె కాంబినేషన్ సీన్స్ విషయంలో పక్కా ప్లానింగ్ తో వున్నాడని అంటున్నారు.
nayanatara
chiranjeevi

More Telugu News