రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజనీకాంత్ రెండో కుమార్తె.. వ్యాపారవేత్త విశ్వగణ్‌తో సౌందర్య వివాహం
- వచ్చే ఏడాది జనవరిలో వివాహం
- నటుడు విశ్వగణ్‌కు కూడా ఇది రెండో వివాహమే
- ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒంటరిగా ఉంటున్న సౌందర్య
నటుడు, వ్యాపారవేత్త అయిన విశ్వగణ్ వనంగమూడితో మూడు ముళ్లు వేయించుకోబోతున్నట్టు కోలీవుడ్ సమాచారం. విశ్వగణ్‌కు కూడా ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. విశ్వగణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. వీరిద్దరి వివాహం వచ్చే ఏడాది జనవరిలో జరగనున్నట్టు తెలుస్తోంది.
గ్రాఫిక్ డిజైనర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సౌందర్య దర్శకురాలిగా తండ్రి రజనీకాంత్-దీపిక పదుకునే పాత్రలతో దేశంలోనే తొలి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ‘కొచాడియాన్’ అనే సినిమాను తీశారు. నిర్మాతగా ‘గోవా’ అనే సినిమాను నిర్మించారు.