చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన అశ్వారావుపేట అభ్యర్థి
- ఉండవల్లిలో చంద్రబాబును కలిసిన అశ్వారావుపేట అభ్యర్థి
- టికెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపిన మెచ్చా
- మెచ్చాతో పాటు చంద్రబాబును కలిసిన సండ్ర వెంకటవీరయ్య
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అనునిత్యం ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు అయినవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వెంట సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, ఆలపాటి రామ్మోహన్ రావు, గారపాటి సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. మరోవైపు, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని మెచ్చా నాగేశ్వరరావు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.