తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన.. చిన్నారికి ‘పవన్ శంకర్’గా నామకరణం!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పోరాటయాత్రలో భాగంగా వేర్వేరు సామాజికవర్గం ప్రజలతో ఆయన మమేకమవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ, భవిష్యత్ లో జనసేన అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రెల్లి కాలనీలో ఈరోజు పర్యటించిన పవన్ కల్యాణ్, ఓ చిన్నారికి నామకరణం చేశారు. ఆ బాబుకు ‘పవన్ శంకర్’ అని పేరు పెట్టారు. రెల్లి సామాజికవర్గానికి జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
నిన్న కాకినాడలో జరిగిన జనసేన బహిరంగ సభలో చంద్రబాబుపై పవన్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అవినీతిరహిత పాలన కోసం చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. ఇప్పుడు ఏపీలో అడుగడుగునా అవినీతి విలయతాండవం చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పునే చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో మళ్లీ చేస్తున్నారన్నారు. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరిస్తే ప్రాంతీయవాదం పుట్టుకొచ్చి మరోసారి రాష్ట్ర విభజన పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు.