దాసరిగారు కట్ చెప్పినా ఎన్టీఆర్ ను అలా చూస్తుండిపోయాను: అంబిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దాసరిగారు కట్ చెప్పినా ఎన్టీఆర్ ను అలా చూస్తుండిపోయాను: అంబిక

  • ఎన్టీఆర్ తో 'విశ్వరూపం' చేశాను
  • ఆయన ప్రొఫెసర్ .. నేను స్టూడెంట్
  • దాసరిగారు అలా అన్నారు         
తెలుగులో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ ... శోభన్ బాబు వంటి అగ్ర కథానాయకులతో కలిసి అంబిక నటించారు. ఎన్టీఆర్ తో చేసిన 'విశ్వరూపం' సినిమాను గురించి ప్రస్తావిస్తూ ఆమె ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "తమిళ ... మలయాళ సినిమాల్లో బిజీగా వున్న సమయంలోనే తెలుగులో ఎన్టీఆర్ గారి 'విశ్వరూపం' సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో ప్రొఫెసర్ అయిన ఎన్టీఆర్ గారిని లవ్ చేసే ఒక స్టూడెంట్ పాత్ర నాది. నాకు మీరంటే ఇష్టమనే విషయాన్ని ప్రొఫెసర్ గారికి నేను పరోక్షంగా చెప్పే సీన్ ను దాసరి గారు తీస్తున్నారు. షాట్ ఓకే అయింది .. దాసరి గారు కట్ చెప్పారు. నేను మాత్రం ఎన్టీఆర్ గారిని అలాగే చూస్తుండిపోయాను. దాసరి గారు మూడోసారి కట్ చెప్పి .. 'ఏంటి అంబిక లైన్ వేస్తున్నావా?' అన్నారు. 'అదికాదు సార్ ..' అని నేను చెబుతుంటే, 'నాకు అర్థమైందిలే' అన్నారంటూ నవ్వేశారు.     
ambika
ntr
dasari

More Telugu News