పూరి సినిమా కోసం రామ్ న్యూ లుక్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పూరి సినిమా కోసం రామ్ న్యూ లుక్?

  • కొంతకాలంగా హిట్ లేని రామ్ 
  • రామ్ కి కథ వినిపించిన పూరి
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడంటూ టాక్
కొంతకాలంగా రామ్ వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ఆయన అభిమానులను కూడా ఈ విషయం నిరాశకి గురిచేస్తోంది. 'హలో గురు ప్రేమ కోసమే' తరువాత రామ్ మరో సినిమాను గురించి ఎనౌన్స్ చేయలేదు. కానీ తన కొత్త లుక్ స్టిల్ ను మాత్రం ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

పూరి జగన్నాథ్ సినిమా కోసమే రామ్ ఇలా కొత్త లుక్ ను సెట్ చేసుకున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇటీవల రామ్ కి పూరి ఒక కథ వినిపించాడనీ, ఆ కథకి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. పూరి తన సినిమాల్లో హీరోలను చాలా డిఫరెంట్ గా చూపిస్తాడు. అందువలన ఆయన సూచన మేరకే రామ్ ఇలా ముస్తాబయ్యాడని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.    
ram
puri

More Telugu News