చివరి కోరికను తీర్చుకోకుండానే తుది శ్వాస విడిచిన అనంత్ కుమార్!
- పలు జాతీయ పదవులు, మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనంత్ కుమార్
- సీఎం కావాలన్న ఆశను తీర్చుకోలేకపోయిన వైనం
- ఎన్నిసార్లు ప్రయత్నించినా దక్కని చాన్స్
ఇక ఆయన తన చివరి రోజుల్లో స్వస్థలమైన దేవనహళ్ళి సమీపంలోని హెగ్గనహళ్లిలో నివాసం ఉండాలని భావించేవారు. తన బాల్యాన్నంతా హెగ్గనహళ్ళి ప్రాంతంలోనే గడిపిన ఆయన, రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత, ఇదే ప్రాంతంలో ఉంటానని తన సన్నిహితులు, బంధువులతో చెప్పుకునేవారు. ఇలా ఆయన తన రెండు కోరికలను తీర్చుకోకుండానే, క్యాన్సర్ బారిన పడి ఈ లోకాన్ని వీడారు. కాగా, అనంత్ కుమార్ అంత్యక్రియలు నేడు అధికార లాంఛనాలతో జరగనున్నాయి.