రెజ్లర్ తో ఛాలెంజ్ చేసిన రాఖీ సావంత్... గాయాలతో ఆసుపత్రిపాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెజ్లర్ తో ఛాలెంజ్ చేసిన రాఖీ సావంత్... గాయాలతో ఆసుపత్రిపాలు!

  • రెజ్లింగ్ ఛాలెంజ్ చేసిన రోబెల్
  • ప్రతిగా డ్యాన్స్ చాలెంజ్ చేసిన రాఖీ
  • డ్యాన్స్ పూర్తికాగానే ఎత్తి నేలకేసి కొట్టిన రోబెల్
  • నడుముకు తీవ్ర గాయంతో ఆసుపత్రికి
మహిళా రెజ్లర్ రోబెల్ చేసిన ఛాలెంజ్ ని స్వీకరించిన బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్, గాయాలతో ఆసుపత్రి పాలైంది. సీడబ్ల్యూఈ చాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా, రింగ్ లోకి దిగిన రాఖీని రోబెల్ తన భుజాల మీదకు ఎత్తుకుని అమాంతం కింద పడేసింది. దీంతో రాఖీ దాదాపు 8 నిమిషాల పాటు విలవిల్లాడింది. ఆపై నిర్వాహకులు రాఖీ పరిస్థితి చూసి, రింగ్ నుంచి బయటకు తెచ్చి ఆసుపత్రికి తరలించారు.

ఈ పోటీ చండీగఢ్ లోని పంచకుల సమీపంలో ఉన్న తావూదేవి లాల్ స్టేడియంలో జరిగింది. పంచకులలో తనతో తలపడే సత్తా ఉన్న ఎవరైనా ముందుకు రావచ్చని రోబెల్ ఛాలెంజ్ విసరగా, రాఖీ సావంత్ 'సై' అంది. రింగ్ లోకి దూకి, తనతో పాటు డ్యాన్స్ చేయాలని సవాల్ విసిరింది. దీంతో రాఖీతో సమానంగా డ్యాన్స్ చేసిన రోబెల్, అది ముగియగానే, రాఖీని అమాంతం ఎత్తి నేలకేసి కొట్టింది. ప్రస్తుతం రాఖీ, జీరఖ్ పూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది.రాఖీ సావంత్ ను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు, ఇతర రెజ్లర్లు
Rakhi Sawant
Regling
Dance
Robel

More Telugu News