ఏపీ ఆర్టీసీ బస్సుల్లో శబరిమలకు వెళ్లే భక్తులకు శుభవార్త!
- నీలక్కల్ లో స్థలం కేటాయింపు
- ఫలించిన ఏపీఎస్ఆర్టీసీ అధికారుల చర్చలు
- కనీసం 50 బస్సులను నిలిపే అవకాశం
గడచిన నాలుగు రోజులుగా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు కేరళ అధికారులతో చర్చలు సాగించారు. కనీసం 50 బస్సులను నిలిపి ఉంచేందుకు స్థలం కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేరళ సర్కారు, అందుకు అనుమతిస్తూ స్థలాన్ని కేటాయించింది. కాగా, ఇప్పటికే చిత్తూరు డిపోకు చెందిన 54 బస్సులను అయ్యప్ప భక్తులు బుక్ చేసుకున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి కూడా బుకింగ్స్ జరుగుతున్నాయి.