నేడు మీడియాతో మాట్లాడనున్న జగన్ తల్లి విజయమ్మ!

  • నేటి ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్
  • జగన్ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడనున్న విజయమ్మ
  • మీడియాకు అందిన ఆహ్వానాలు
చాలా రోజుల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, జగన్ తల్లి వైఎస్ విజయమ్మ నేడు మీడియా ముందుకు రానున్నారు. ఈ ఉదయం ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు అన్ని చానళ్లు, దినప్రతికలకు ఆహ్వానాలు అందాయి. జగన్ పై దాడి తరువాత నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె ప్రజలకు సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

గత నెలలో విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆపై చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన వైఎస్ జగన్, రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న తరువాత, వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే విశ్రాంతి పొందుతున్నారు. నేటి రాత్రి జగన్ తిరిగి విశాఖకు బయలుదేరనున్నారు. ఆపై రేపటి నుంచి తన ప్రజాసంకల్ప యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.
Go Back to Shorts
YS Vijayamma
Jagan
YSRCP
Padayatra

More Telugu News