సినిమా కబుర్లు .. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు .. సంక్షిప్త సమాచారం

  • తమిళనాట 'సర్కార్' సంచలనం
  • 'ఎఫ్ 2' కోసం భారీగా బ్రిడ్జ్ సెట్ 
  • 'సినారే' పాత్రలో రామజోగయ్య శాస్త్రి  
* మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'సర్కార్' చిత్రం తమిళనాట వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజులలో ఈ సినిమా అక్కడ 63 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది తమిళనాట అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా 'సర్కార్' నిలవడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

* అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా నిర్మితమవుతోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ కోసం అక్కడ భారీగా బ్రిడ్జ్ సెట్ ను వేయించారు. జనవరి 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

* పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న రామజోగయ్య శాస్త్రి, అప్పుడప్పుడు తెరపై కూడా మెరుస్తుంటారు. అలాంటి రామజోగయ్య శాస్త్రి, 'ఎన్టీఆర్'బయోపిక్ లో 'సినారే'పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలకి 'సినారె' అద్భుతమైన పాటలు రాశారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది.    
vijay
venkatesh
ramajogayya

More Telugu News