టీజర్ తోనే దుమ్మురేపేస్తోన్న చరణ్
- చరణ్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్
- రామ్ పాత్రలో కనిపించనున్న చరణ్
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
బోయపాటి మార్క్ తోనే ఈ టీజర్ బయటికి వచ్చింది. లవ్ కి సంబంధించిన అంశాలకి గానీ .. ఫ్యామిలీ డ్రామాను గాని టచ్ చేయకుండా, కేవలం యాక్షన్ .. ఎమోషన్ పైనే దృష్టి పెట్టారు. బోయపాటి మూవీ ప్రధాన లక్షణమైన భారీతనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ పాత్రలో చరణ్ కనిపిస్తుండగా, ఆయన ఇంటిపేరును 'కొణిదెల'గా చెప్పుకోవడం మెగా అభిమానులను ఖుషీ చేసే విషయం. సంక్రాంతికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.