వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర విషయంలో దిగివచ్చిన మురుగదాస్
- 'సర్కార్' సినిమా చుట్టూ అల్లుకున్న వివాదం
- కొన్నిచోట్ల థియేటర్ల ధ్వంసం
- అభ్యంతరకర సన్నివేశాల కత్తిరింపు
ఈ వివాదం కారణంగా కొన్ని చోట్ల ప్రదర్శనలు నిలిచిపోవడం .. థియేటర్ల ధ్వంసం .. మురుగదాస్ పై కేసులు వంటి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో .. వరలక్ష్మీ శరత్ కుమార్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించాలనీ, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయాలని మురుగదాస్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఈ సినిమా టీమ్ రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు.