కోహ్లీని విమర్శిస్తూ ట్వీట్ చేసిన హీరో సిద్ధార్థ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోహ్లీని విమర్శిస్తూ ట్వీట్ చేసిన హీరో సిద్ధార్థ!

  • అభిమానిని దేశం విడిచి పోవాలన్న కోహ్లీ
  • మండిపడుతున్న నెటిజన్లు
  • కోహ్లీ నుంచి చెత్త మాటలు వచ్చాయన్న సిద్ధార్థ
ఓ అభిమానిని దేశం విడిచి పోవాలంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. పలువురు సెలబ్రిటీలతో పాటు, నెటిజన్లు కోహ్లీని ఏకి పారేస్తున్నారు. తాజాగా సినీ హీరో సిద్ధార్థ సైతం కోహ్లీపై విమర్శలు ఎక్కుపెట్టాడు. 'కింగ్ కోహ్లీలా నీవు నిలవాలనుకుంటే... భవిష్యత్తులో ఏదైనా మాట్లాడే ముందు 'ద్రవిడ్ అయితే ఏం మాట్లాడతాడు?' అని నీకు నీవే ఆలోచించుకో. ఒక ఇండియన్ క్రికెట్ కెప్టెన్ నుంచి ఎలాంటి చెత్త మాటలు వచ్చాయి' అంటూ ట్వీట్ చేశాడు.

వివాదం విషయంలోకి వెళ్తే, ఈ నెల 5న కోహ్లీ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన పేరుతో యాప్ ను లాంచ్ చేశాడు. 'కోహ్లీ ఓవర్ రేటెడ్ బ్యాట్స్ మెన్. అతని బ్యాటింగ్ లో ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇండియన్ల కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్లేయర్ల బ్యాటింగ్ నే నేను ఎక్కువ ఆస్వాదిస్తా' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోహ్లీ ఘాటుగా స్పందించాడు. 'నీవు ఇండియాలో నివసించాల్సిన అవసరం లేదు. వేరే దేశాలను ఇష్టపడే నీవు ఇక్కడెందుకు ఉంటున్నావు. వేరే ఏ దేశంలోనైనా నివసించు' అంటూ సమాధానమిచ్చాడు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
Virat Kohli
actor sidharth
kollywood

More Telugu News