నోట్ల రద్దును అటు చంద్రబాబు, ఇటు లోకేశ్ స్వాగతించారు.. మేం మాత్రమే వ్యతిరేకించాం!: పవన్ కల్యాణ్
- చివరికి వైసీపీ కూడా దాన్ని సమర్ధించింది
- పర్యవసానాలపై మేం మాత్రమే మాట్లాడాం
- ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన జనసేన అధినేత
ఈ మేరకు పవన్ కల్యాణ్ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. రూ.1,000, రూ.500 నోట్ల రద్దు కారణంగా వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ జనసేన చేసిన పోరాటంపై మీడియాలో వచ్చిన కథనాల లింక్స్ ను పంచుకున్నారు. 2016, నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.