అద్భుత ఫీచర్లతో ఒప్పో నుండి రెండు స్మార్ట్ ఫోన్ లు విడుదల!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అద్భుత ఫీచర్లతో ఒప్పో నుండి రెండు స్మార్ట్ ఫోన్ లు విడుదల!

  • 'ఒప్పో ఆర్ఎక్స్17ప్రో', 'ఒప్పో ఆర్ఎక్స్17నీయో' విడుదల
  • 'ఆర్ఎక్స్17ప్రో' ఫోన్ ధర సుమారుగా రూ.49000
  • 'ఆర్ఎక్స్17నీయో' ఫోన్ ధర సుమారుగా రూ.29000
ఒప్పో నుండి రెండు నూతన స్మార్ట్ ఫోన్లు తాజాగా యూరప్ మార్కెట్లో విడుదల అయ్యాయి. 'ఒప్పో ఆర్ఎక్స్17ప్రో', 'ఒప్పో ఆర్ఎక్స్17నీయో' పేరిట విడుదలైన ఈ ఫోన్లు ఈ నెల 16 నుండి ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెథర్లాండ్ దేశాలలో వినియోగదారులకి అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్లు త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగు పెట్టనున్నాయి. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఆర్ఎక్స్17నీయో స్మార్ట్ ఫోన్ ధర సుమారుగా రూ.29000 ఉండగా, 6జీబీ ర్యామ్,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల 'ఆర్ఎక్స్17ప్రో' ఫోన్ ధర సుమారుగా రూ.49000గా ఉంది. ఫ్లాష్ ఛార్జ్, సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లలో అధునాతన టెక్నాలజీని ఏర్పాటు చేసి మార్కెట్లో విడుదల చేశారు.

'ఒప్పో ఆర్ఎక్స్17ప్రో' ఫీచర్లు:

  • ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 12/20 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు (3వ కెమెరా 3డీ సెన్సింగ్)
  • 6.4" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (కలర్ ఓఎస్ 5.2)
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
  • 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 3700 ఎంఏహెచ్ బ్యాటరీ(ఫాస్ట్ చార్జింగ్)

'ఒప్పో ఆర్ఎక్స్17నీయో' ఫీచర్లు:

  • ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 16/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 6.4" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (కలర్ ఓఎస్ 5.2)
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
  • 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 3600 ఎంఏహెచ్ బ్యాటరీ


Oppo RX17 Pro
oppo RX17 Neo
smartphone
technology
Tech-News
China
India

More Telugu News