నా సినిమాల్లో నాకు నచ్చింది అదే: జగపతిబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా సినిమాల్లో నాకు నచ్చింది అదే: జగపతిబాబు

  • 'పెద్దరికం' నా తొలి హిట్ మూవీ 
  • 'గాయం' నన్ను కొత్తగా చూపించింది
  • 'అంతఃపురం' నాకు ఇష్టమైన సినిమా
తాజాగా జగపతిబాబు .. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొనగా, 'మీ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది?' అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "నా సినిమాల్లో నాకు బాగా నచ్చింది 'గాయం' అవుతుంది. నా ఫస్టు హిట్ 'పెద్దరికం' .. ఈ సినిమా చూసే నన్ను 'గాయం' కోసం తీసుకున్నారు. 'గాయం'లో నా వాయిస్ తో నేను చేశాను. ఈ సినిమాలో నన్ను రామ్ గోపాల్ వర్మ కొత్తగా చూపించాడు. ఆ ఇమేజ్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఇమేజ్.

ఇక 'అంతఃపురం' నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ ఫెర్ఫార్మెన్స్ మళ్లీ నేనే రిపీట్ చేయలేను. 'అంతఃపురం'లో ఒక సీన్ అనుకున్న విధంగా రావడం కోసం మందు తాగి చేయవలసి వచ్చింది. అలా అని చెప్పేసి అలా చేయడం హండ్రెడ్ పర్సెంట్  కరెక్ట్ అని చెప్పను .. తప్పని కూడా నేను అనుకోవడం లేదు" అని చెప్పుకొచ్చారు.
 
jagapathibabu

More Telugu News