వీడు ఆర్టిస్ట్ గా పనికిరాడని ఒక నిర్మాత అన్నప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: జగపతిబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వీడు ఆర్టిస్ట్ గా పనికిరాడని ఒక నిర్మాత అన్నప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: జగపతిబాబు

  • నేను టైమ్ ను నమ్ముతాను 
  • ప్రస్తుతం నా టైమ్ బాగుంది 
  • ఎప్పుడూ ఇదే పొజీషన్ ఉంటుందని అనుకోను    
జగపతిబాబు కెరియర్ ను పరిశీలిస్తే నటుడిగా ఆయన ఎదుగుతూ వచ్చారు. అయితే కెరియర్ ఆరంభంలోను .. ఆ తరువాత ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

" నా కెరియర్లో ఓ నాలుగు సార్లు డిప్రెషన్ లోకి వెళ్లి వుంటాను. ఒక నిర్మాత 'వీడు ఆర్టిస్ట్ గా పనికి రాడు' అన్నప్పుడు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. నాతో సినిమాలు తీయడం వలన నాన్నగారు ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు రెండోసారి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అప్పటి నుంచే టైమ్ ను నమ్మడం మొదలుపెట్టాను. అప్పుడు నా టైమ్ బాగోలేదు గనుక నా సినిమాలు ఆడలేదు .. ఇప్పుడు నా టైమ్ బాగుంది గనుక నా సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఇదే పొజీషన్లో నేను ఉండను ..  నా తరువాత వేరే వాళ్లు వస్తారు. అందువలన ఇక కెరియర్ గురించి సీరియస్ గా తీసుకోదలచుకోలేదు" అని చెప్పుకొచ్చారు.   
jagapathibabu

More Telugu News