ఎయిరిండియా సిబ్బంది మెరుపుసమ్మె... ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వేలాది మంది!
- డిమాండ్ల పరిష్కారానికి సమ్మె
- ఆలస్యంగా నడుస్తున్న విమాన సర్వీసులు
- పరిస్థితి చక్కబడుతుందన్న ఏఐ ప్రతినిధి
ఇటీవల విధుల నుంచి తొలగించిన ఉద్యోగిని వెంటనే తిరిగి తీసుకోవాలని ముంబైలోని కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెను ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాగా, విమాన సర్వీసులకు ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకున్నామని, విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిన వారిని వెనక్కు పిలిపించి, సర్వీసులను ఆలస్యంగా నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.