ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు: మంచిర్యాల జిల్లాలో పోస్టర్లు

మంచిర్యాల జిల్లాలో మావోయిస్టులు కలకలం సృష్టించారు. ముందస్తు ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న రాజకీయ నాయకులకు షాకిచ్చారు. ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పద్దెనిమిది చోట్ల సింగరేణి కార్మిక సంఘం పేరుతో మావోయిస్టులు అంటించిన ఈ పోస్టర్లు స్థానికంగా తీవ్ర కలకలానికి కారణమవుతున్నాయి. పోస్టర్లతో పాటు సీడీలు, లేఖలను కూడా మావోయిస్టులు విడుదల చేశారు.
Go Back to Shorts
maoists posters
Mancherial District
bellampalli

More Telugu News