మరింతగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు!

  • అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన క్రూడాయిల్ ధరలు
  • లీటరు పెట్రోలుపై 21 పైసల తగ్గింపు
  • డీజిల్ పై 18 పైసల తగ్గింపును ప్రకటించిన ఐఓసీ
ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉండటంతో దేశంలోనూ పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల కొనసాగింది. నేడు లీటరు పెట్రోలుపై 21 పైసలు, డీజిల్ పై 18 పైసలు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 78.21కి, డీజిల్ ధర రూ. 72.89కి తగ్గింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 83.72, డీజిల్ ధర రూ. 76.38కి చేరుకోగా మిగతా ప్రాంతాల్లోనూ ధరలు ఆ మేరకు తగ్గాయి.
Go Back to Shorts
India
Petrol
Diesel
Prise Slash

More Telugu News