హైదరాబాద్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన మహిళ!
- విక్టోరియా మెమోరియల్ స్టేషన్ లో ఘటన
- కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యాయత్నం
- కేసు నమోదు చేసిన పోలీసులు
పై నుంచి కిందపడిన ఆమెకు సంబంధించిన వీడియో ఫుటేజ్, సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. మహిళ కిందకు దూకడాన్ని చూసిన కొందరు స్థానికులు, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని, ఓ చెయ్యి విరిగిందని వైద్యులు వెల్లడించారు. భర్త రాజేష్ కు దూరంగా ఉంటున్న ఆమె, తన రెండేళ్ల బిడ్డ పెంపకం విషయమై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.