శోభన్ బాబును ఒప్పించడం చాలా కష్టమైపోయింది: పరుచూరి గోపాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శోభన్ బాబును ఒప్పించడం చాలా కష్టమైపోయింది: పరుచూరి గోపాలకృష్ణ

  • శోభన్ బాబుతో 'సర్పయాగం' చేశాను 
  • గ్లామర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు 
  • తెల్ల గెడ్డంతో కనిపించనన్నారు
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో శోభన్ బాబు గురించి ప్రస్తావించారు. " శోభన్ బాబు హీరోగా 'సర్పయాగం' సినిమాకి దర్శకత్వం వహించాను. 40 రోజుల పాటు శోభన్ బాబుతో షూటింగ్ చేశాను. గ్లామర్ విషయంలో ఆయన ఎంత కేర్ తీసుకుంటారో తెలిసిందే.

'సర్పయాగం' సినిమా క్లైమాక్స్ లో ఆయన కొంచెం నెరిసిన గెడ్డంతో కనిపించాల్సి ఉంటుంది .. అందుకు ఆయన ఒప్పుకోలేదు. 'నేను లేడీస్ ఇష్టపడే హీరోని ... తెల్ల గెడ్డంతో కనిపిస్తే బాగుండదు' అన్నారు. 'ప్లీజ్ అండీ .. కూతురు చనిపోయింది .. ఓ తండ్రిగా మీరు బాధలో వున్నారు .. ఆ బాధలో కోర్టులో మాట్లాడుతున్నారు .. ఆడియన్స్ వైపు నుంచి మీ పాత్రకి సానుభూతి కావాలి' అని చెప్పాను. అప్పుడు ఆయన 'ఓకే' అన్నారు. నిజంగా ఈ విషయంలో ఆయనను ఒప్పించడానికి అటు సూర్యుడు ఇటు పొడిచాడు' అంటూ నవ్వేశారు.      
paruchuri
sobhan babu

More Telugu News