ప్రేమ మీద నమ్మకం పోయింది .. పెళ్లి చేసుకుంటే ఫ్లాప్ అయింది: నటి జ్యోతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమ మీద నమ్మకం పోయింది .. పెళ్లి చేసుకుంటే ఫ్లాప్ అయింది: నటి జ్యోతి

  • నన్ను ప్రేమిస్తున్నట్టు చాలామంది చెప్పారు
  • శుభలేఖల వరకూ వచ్చి ఒక సంబంధం ఆగిపోయింది
  • 'నాన్న' అనే మాటకు మా అబ్బాయి దూరమయ్యాడు  
నటిగా మంచి పేరు తెచ్చుకున్న జ్యోతి, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. "నన్ను ప్రేమిస్తున్నానంటూ చాలామంది కుర్రాళ్లు నాతో చెప్పారు. లవ్ పేరుతో నా మనసును కష్టపెట్టిన రెండు మూడు సంఘటనలు జరిగాయి. శుభలేఖల వరకూ వచ్చిన ఒక సంబంధం కూడా కొన్ని కారణాల వలన ఆగిపోయింది.

ఇక నాకు లవ్ మీద నమ్మకం పోవడంతో, పెళ్లి విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నాను. చాలా చిన్నవయసులోనే .. దుబాయ్ కి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను .. కొంతకాలానికి ఆ అనుబంధానికి తెరపడింది. మా అబ్బాయి నాతోనే వున్నాడు కదా అనే ఆనందంతో నేను వున్నాను. కానీ 'నాన్న' అనే మాటకు వాడు దూరమయ్యాడే అనే బాధ నాకు కలుగుతూ వుంటుంది. మేం చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవిస్తున్నాడే అనిపిస్తూ వుంటుంది" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.     
ali
jyothi

More Telugu News