శత్రువులపై విరుచుకుపడుతోన్న చరణ్ .. 'వినయ విధేయ రామ' నుంచి ఫస్టులుక్
- యాక్షన్ మోడ్ లో చరణ్
- ఈ నెల 9న టీజర్ రిలీజ్
- సంక్రాంతికి సినిమా విడుదల
బోయపాటి యాక్షన్ మార్క్ కి తగినట్టుగా, శత్రువులపై విరుచుకుపడుతూ చరణ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. చరణ్ లుక్ ఆయన అభిమానులను ఖుషీ చేస్తుందనే చెప్పాలి. ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన ఉదయం 10:25 గంటలకు టీజర్ ను వదలనున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ప్రశాంత్ .. స్నేహ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు.