తెలంగాణ మహాకూటమిలో చేరిన మరో పార్టీ!
- మహాకూటమిలో చేరిన ఆల్ ఇండియా ముస్లిం నేషనల్ లీగ్
- ముస్లింలను కేసీఆర్ మోసం చేశారన్న పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఘనీ
- టీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యమన్న నేత
రిజర్వేషన్ల విషయంలో ముస్లింలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను అటకెక్కించారని... తగిన నిధులను కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ముస్లింలను మోసం చేసిన టీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యమని... అందుకే, మహాకూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.