Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎస్వీ రంగారావును గుర్తు చేయనున్న ప్రకాశ్ రాజ్

  • పూర్తి వినోదభరిత చిత్రంగా 'ఎఫ్ 2'
  • కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  
వివిధ భాషల్లో విలక్షణ నటుడిగా ప్రకాశ్ రాజ్ కనిపిస్తారు. ఏ పాత్రను పోషించినా ఆ పాత్ర ఆయన మాత్రమే చేయగలరు అనుకునేలా మెప్పించే ప్రకాశ్ రాజ్, 'ఎఫ్ 2' సినిమాలో ఎస్వీ రంగారావును గుర్తుచేస్తారని సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ - వరుణ్ తేజ్ హీరోలుగా 'ఎఫ్ 2' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పూర్తి వినోదభరితంగా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, హీరోయిన్ల తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారట.

పాత సినిమాల్లో ఎస్వీ రంగారావు తండ్రి పాత్రలచే ప్రభావితమైన వ్యక్తిగా, తన ఇద్దరు కూతుళ్లను ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములకు ఇవ్వాలనే ఆలోచన కలిగిన తండ్రిగా ప్రకాశ్ రాజ్ కనిపిస్తాడని అంటున్నారు. ప్రకాశ్ రాజ్ బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ .. లుక్ ఎస్వీఆర్ మాదిరిగానే వుంటాయని చెబుతున్నారు. ఈ సినిమాకి హైలైట్ గా ఆయన పాత్ర నిలుస్తుందని అంటున్నారు. ప్రకాశ్ రాజ్ కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల జాబితాలో ఈ పాత్ర కూడా చేరుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.      
venkatesh
varun
sv rangarao

More Telugu News