సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయని తమిళ తంబీలు!

  • 2 గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చాలి
  • సుప్రీంకోర్టు ఆదేశాలపై మండిపడుతున్న యువత
  • రోడ్లపైకి వచ్చి మరీ పండగ చేసుకుంటున్న యువత
దీపావళి సందర్భంగా కేవలం 2 గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమిళనాడు వాసులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ మనోభావాలకు ఈ ఆదేశాలు వ్యతిరేకమని అంటున్నారు.

 సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఉదయం 6 నుంచి 7 వరకు, రాత్రి 7 నుంచి 8 వరకు టపాకాయలు కాల్చుకోవచ్చని తమిళనాడు సర్కారు ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ వీటిని పాటించిన పరిస్థితి కనిపించలేదు. నరక చతుర్దశి సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంతగా రోడ్లపైకి వచ్చిమరీ టపాకాయలు కాల్చారు యువత. నేడు, రేపు తాము దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటామని చెబుతున్నారు.
Go Back to Shorts
Tamilnadu
Deewali
Crakers
Supreme Court

More Telugu News