Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సర్కార్'లో అవకాశం రావడం తేలికైన విషయం కాదు!: కీర్తి సురేశ్

  • మురుగదాస్ కథ చెప్పారు 
  • టీమ్ పై నమ్మకం ఏర్పడింది 
  • మీ ఇంట్లో అమ్మాయిలా కనిపిస్తాను       
బలమైన కథాకథనాలను సిద్ధం చేసుకోవడం .. వాటిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించడం మురుగదాస్ ప్రత్యేకత. అలా ఆయన తాజా చిత్రంగా 'సర్కార్' చిత్రం నిర్మితమైంది. విజయ్ సరసన కథానాయికగా కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమా, దీపావళి కానుకగా రేపు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. "మురుగదాస్ గారు కథ చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. అలాగే నా పాత్ర కూడా డిఫరెంట్ గా ఉందనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాకి పనిచేస్తోన్న టీమ్ పట్ల నాకు నమ్మకం ఏర్పడింది. ఈ ప్రాజెక్టు ఒక రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వెళుతుందని భావించాను. ఈ ప్రాజెక్టులో అవకాశం రావడం అంతతేలికైన విషయం కాదు గాబట్టి, అదృష్టం అనుకున్నాను. ఈ సినిమా చూసిన వాళ్లకి నా పాత్ర .. తమ ఇంట్లో అమ్మాయిగా అనిపిస్తుంది. తెలుగు .. తమిళ ప్రేక్షకుల ముందుకు 'పందెం కోడి 2' తో వచ్చాను. పెద్దగా గ్యాప్ అనేది లేకుండా 'సర్కార్' తో మళ్లీ వాళ్లను పలకరించనున్నందుకు ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చింది.      
vijay
keerti suresh

More Telugu News