‘కేదార్ నాథ్’ సినిమాను ఆపేయండి.. ముద్దు సీన్లపై ఆలయ పూజారుల ఆగ్రహం!
- ఇది లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉంది
- మా మనోభావాలను దెబ్బతీసేలా షూట్ చేశారు
- నిషేధించకుంటే ఆందోళనకు దిగుతాం
ఇటీవల విడుదలైన కేదార్ నాథ్ సినిమా టీజర్ పై ఆలయ పూజారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను నిషేధించకపోతే భారీగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ సినిమా లవ్ జిహాద్ ను ప్రేరేపించేలా, తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా పోస్టర్లో ముస్లిం యువకుడు, హిందూ యువతిని మోసుకెళుతున్నట్లు చూపించారు. అసలు కేదార్ నాథ్ కు ముస్లింలే రారని వ్యాఖ్యానించారు. అలాంటిది వేలాదిమంది వరదల్లో కొట్టుకునిపోతుంటే మధ్యలో ముద్దు సీన్లను పెట్టారన్నారు.