శంకర్ కు రాజమౌళి ప్రశ్న... సమాధానంగా రాజమౌళినే చూపించిన శంకర్!
- రూ. 600 కోట్లతో తెరకెక్కిన '2.ఓ'
- ఇంత కూల్ గా ఎలా ఉన్నారన్న రాజమౌళి
- మిమ్మల్ని చూసిన తరువాత ఇంకేంటన్న శంకర్
"500 కోట్లతో సినిమా చేసి కూడా ఇంత కూల్ గా ఎలా ఉంటున్నారు? అసలెలా ప్రెజర్ ఫీల్ కాకుండా ఉంటున్నారు, కాస్త చెప్పండి సర్" అని రాజమౌళి ప్రశ్నించగా, దానికి శంకర్ స్పందించారు. "నేను రాజమౌళికి పెద్ద ఫ్యాన్. ఇండియన్ సినిమా మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. నా హార్డ్ వర్క్ తోనే ఒత్తిడిని జయిస్తా. మిమ్మల్ని చూసిన తరువాత ఇంక ప్రెజర్ ఏంటి సార్?" అని సమాధానం చెప్పారు. రాజమౌళి మాటలు '2.ఓ' ట్రైయిలర్ కు బైట్స్ రూపంలో రాగా, తెరపై రాజమౌళి కనిపించగానే, అభిమానులు కేరింతలు కొట్టారు.