Chandrababu: చంద్రబాబు రాజకీయ వ్యభిచారి: సోము వీర్రాజు ధ్వజం

  • టీడీపీ సిద్ధాంతాలను పక్కన పెట్టేశారు
  • చంద్రబాబుపై ఎన్టీఆర్ కుటుంబసభ్యులు తిరుగుబాటు చేయాలి
  • టీడీపీకి 30 సీట్లకు మించి రావు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సిద్ధాంతాలను చంద్రబాబు పక్కన పెట్టేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని... పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్ తో చేతులు కలిపారని విమర్శించారు. చంద్రబాబు ఒక రాజకీయ దళారీ అని, రాజయకీయ వ్యభిచారి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో జతకట్టిన చంద్రబాబుపై ఎన్టీఆర్ కుటుంబసభ్యులు తిరుగుబాటు చేయాలని కోరారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని... ఆ పార్టీకి 30 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. 
Chandrababu
somu veerraju
Telugudesam
bjp
ntr
congress

More Telugu News