రూ. 100 కోట్లు ఇస్తానన్నాడు.. సాజిద్ ఖాన్ పై సలోనీ చోప్రా ఆరోపణలు!

  • సాజిద్ పై ఆరోపణలు చేసిన మరో నటి
  • చీకటి గదిలోకి తీసుకెళ్లాడన్న సలోనీ 
  • ముఖ్యమైన పాత్రలకు దూరం చేశాడని ఆరోపణ
దేశవ్యాప్తంగా 'మీటూ' ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత, దర్శకుడు సాజిద్ ఖాన్ తనను వేధించాడని నటి సలోనీ చోప్రా ఆరోపించింది. ఓ జాతీయ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, షాజిద్ నిజస్వరూపం గురించి విని కూడా, ఓ సమావేశం నిమిత్తం ఆయన ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని చెబుతూ, నాటి ఘటనను గుర్తు చేసుకుంది. తనను చీకటిగా ఉన్న ఓ గదిలోకి ఆయన తీసుకెళ్లాడని, బయట కూర్చుందామని తాను అడిగితే, అక్కడే ఉన్న వాళ్ల అమ్మకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడని తెలిపింది.

ఆయన ప్రవర్తనపై తనకు అనుమానం వచ్చి, తాను ఓ పోలీసు అధికారి కుమార్తెనని అబద్ధం చెప్పానని, అయినా, అతని వేధింపులు ఆగలేదని వెల్లడించింది. ముద్దు పెడితే డబ్బులిస్తానని ప్రారంభించిన అతని సంభాషణ, రూ. 100 కోట్లు ఇస్తా, శునకంతో శృంగారం చేస్తావా? అని అడిగేంత వరకూ వచ్చిందని చెప్పింది.

తాను గట్టిగా అడిగితే, లైట్లు వేశాడని, అతని కోరిక తీర్చేందుకు తాను మొండిగా నిరాకరించానని, దీంతో తన గొంతు బాగాలేదని, అతిగా ఆలోచిస్తుంటానని చెబుతూ, ముఖ్యమైన పాత్రలకు దూరం చేశాడని ఆరోపించింది. కాగా, సాజిద్ పై లైంగిక ఆరోపణలు చేస్తున్న వారి సంఖ్య పెరగడంతో, అతన్ని 'హౌస్ ఫుల్ 4' దర్శక బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
shajid khan
Saloni Chopra
MeToo India

More Telugu News