అక్టోబరులో భారతీయులు ఎక్కువగా మాట్లాడుకున్నది దీని గురించేనట!
- గత నెలలో ఎక్కువ చర్చనీయాంశమైన అంశంగా ‘మీటూ’
- వెల్లడించిన ‘మెల్ట్‌వేర్’
- హాలీవుడ్లో మొదలై ప్రపంచవ్యాప్తమైన ‘మీటూ’ ఉద్యమం
అక్టోబరు 1 నుంచి 30 మంది డేటాను విశ్లేషించగా ఈ విషయం బయటపడినట్టు ‘మెల్ట్‌వేర్’ వివరించింది. ‘మీటూ’పై అక్టోబరులో మొత్తంగా 28,900 ఎడిటోరియల్ న్యూస్ వచ్చింది. ఇందులో 95 శాతం అక్టోబరు 10 నుంచి 18 మధ్య రావడం గమనార్హం. ఆ సమయంలో భారత్‌లో ఈ ఉద్యమం తీవ్రస్థాయిలో నడుస్తోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణలతో దేశంలో ఉద్యమం ఊపందుకుంది.