సామాన్యుడికి మళ్లీ భారం.. సిలిండర్‌పై రూ.2.94 వడ్డన
- సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.60 పెంపు
- బుధవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి
- గత ఆరు నెలల్లో రూ.14.15 పెంపు
అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, విదేశీ మారక ద్రవ్యంలో ఒడిదొడుకులు కారణంగానే ధరలు పెంచినట్టు ఐవోసీఎల్ తెలిపింది. కాగా, ఇప్పటి వరకు గ్యాస్ వినియోగదారుల ఖాతాలో ఒక్కో సిలిండర్‌కు రూ.376.60 జమకాగా, ఈ నెల నుంచి రూ.433.66 జమ కానున్నాయి. కాగా, గత ఆరు నెలల్లో ఒక్కో సిలిండర్‌పై రూ.14.15 పెరిగింది.