రాహుల్ గాంధీ పొరపాటు... 100 సార్లు ఇంపోజిషన్ శిక్ష వేసిన అమిత్ షా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ గాంధీ పొరపాటు... 100 సార్లు ఇంపోజిషన్ శిక్ష వేసిన అమిత్ షా!

  • మిజోరాం బదులు మణిపూర్ అని రాసిన రాహుల్
  • రెండూ వేర్వేరు రాష్ట్రాలని వందసార్లు రాయండి
  • ట్విట్టర్ ఖాతాలో అమిత్ షా సెటైర్లు
తన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో తప్పు చేసిన రాహుల్ గాంధీ మరోసారి బీజేపీకి టార్గెట్ అయిపోయారు. రాహుల్ చేసిన తప్పును పసిగట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వంద సార్లు ఇంపోజిషన్ రాయాలంటూ శిక్ష వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే, మిజోరాంలోని సైనిక స్కూల్ విద్యార్థినులను అభినందిస్తూ, ఓ ట్వీట్ పెట్టిన రాహుల్, మిజోరాం బదులు మణిపూర్ అని రాశారు. ఈ పొరపాటును బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య కనిపెట్టి సెటైర్లు వేయగా, రాహుల్ దాన్ని తొలగించారు. అప్పటికే దాని స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన అమిత్ షా, "కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఈశాన్య భారతంలో మణిపూర్, మిజోరం వేర్వేరు రాష్ర్టాలని గుర్తుంచుకుంటా అని వందసార్లు రాయండి" అని ట్వీట్ చేశారు. రాహుల్ పై బీజేపీ నేతల సెటైర్లు కొనసాగుతున్నాయి.
Rahul Gandhi
Amit Shah
Twitter
Manipur
Mizoram

More Telugu News