రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేస్తా: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
- వ్యాపమ్, పనామా పేపర్ల కుంభకోణాల్లో శివరాజ్, ఆయన కుమారుడు ఉన్నారన్న రాహుల్
- బీజేపీ వ్యక్తులను చిన్నచూపు చూడటం కాంగ్రెస్ కు అలవాటేనన్న శివరాజ్
- మళ్లీ అధికారంలోకి రాలేమన్న నిరాశలో రాహుల్ ఉన్నారు
బీజేపీకి చెందిన వ్యక్తులను చిన్న చూపు చూడటం కాంగ్రెస్ కు అలవాటేనని శివరాజ్ విమర్శించారు. ప్రధాని మోదీని మృత్యు వ్యాపారి, నీచుడు, తేలు అని కాంగ్రెస్ సంబోధిస్తుందని మండిపడ్డారు. తనను పనికిమాలినవాడు అని అంటుందని దుయ్యబట్టారు. మళ్లీ అధికారంలోకి రాలేమన్న నిరాశలో రాహుల్ ఉన్నారని... ఈ నిరాశ ఆయనను మానసికంగా దెబ్బతీస్తోందని చెప్పారు.