అమెరికాలో లోయలో పడి దుర్మరణం పాలైన ఐటీ ఇంజనీర్లు విష్ణు, మీనాక్షి!
- కాలిఫోర్నియా యోసిమైట్ నేషనల్ పార్కులో విషాదం
- 800 అడుగుల లోయలో పడిపోయిన దంపతులు
- మృతదేహాలను వెలికితీసిన అధికారులు
దీంతో అప్పటివరకూ న్యూయార్క్ లో నివాసం ఉన్న వీరు, శాన్ జోస్ కు కాపురం మార్చారు. ట్రావెలింగ్, అడ్వెంచర్స్ చేయడంలో ఆసక్తి చూపే ఈ జంట ఆదివారం నాడు పార్క్ కు వచ్చింది. ఈ క్రమంలో వారు లోయను చూస్తున్న వేళ, ఇద్దరూ లోయలో పడిపోయారు. సోమవారం నాడు వీరి మృతదేహాలను బయటకు తీసిన అధికారులు, ఎందుకు ఈ ప్రమాదం జరిగిందన్న విషయమై విచారిస్తున్నామని తెలిపారు. వీరికి 2014లో వివాహం జరిగిందని, ఇద్దరూ ప్రతిభావంతులైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని, వీరి మరణం దురదృష్టకరమని అన్నారు.