Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీనివాసరావు ఫ్లాట్ లోని మరో గదిలో ఇద్దరు అమ్మాయిలు... జగన్ పై దాడికి ముందు మాయం!

  • ఎయిర్ పోర్టుకు దగ్గర్లోనే ఉండే శ్రీనివాసరావు
  • అతనితోపాటు మరో నలుగురు, అందులో ఇద్దరు అమ్మాయిలు
  • ఘటనకు కొద్ది రోజుల ముందు మాయం
గత వారంలో వైకాపా అధినేత వైఎస్ జగన్ పై కత్తితో దాడికి పాల్పడిన శ్రీనివాసరావు గురించి విచారించిన పోలీసులు, మరో ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎయిర్ పోర్టుకు కేవలం కిలోమీటరు దూరంలోనే ఉన్న ఓ ఫ్లాట్ లో శ్రీనివాసరావు, అతని స్నేహితుడు రాజు, మరో యువకుడు, ఇద్దరు యువతులు ఉండేవారని తెలుస్తోంది. వీరందరూ ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ లోనే పని చేస్తున్నారు.

ఇక, జగన్ పై దాడికి కొన్ని రోజుల ముందు ఈ ఇద్దరు అమ్మాయిలూ వెళ్లిపోగా, గ్వాలియర్ నుంచి నరేష్‌ కుష్వా, భరత్‌ సింగ్‌ అనే ఇద్దరు కుక్ లు వచ్చారు. వీరిద్దరూ గతంలో అదే రెస్టారెంట్ లో పని చేసి గ్వాలియర్ కు వెళ్లిపోగా, వారిని అధిక వేతనంపై తిరిగి వెనక్కు పిలిపించినట్టు తెలుస్తోంది. వీరు వచ్చేసరికి కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఎవరు? వారు ఎక్కడికి వెళ్లారన్న విషయాలపై మరింత స్పష్టత రావాల్సివుంది. వీరిద్దరి దుస్తులూ ఇంకా శ్రీనివాసరావు ఉన్న ఫ్లాట్ లోనే ఉండటం గమనార్హం.

కాగా, నిన్న జగన్ పై దాడి కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ బృందం, ఈ ఫ్లాట్ కు వెళ్లి ఇద్దరు కుక్ లను విచారించింది. శ్రీనివాస్ గురించి తమకేమీ తెలియదని, ఐదు రోజుల క్రితమే వచ్చామని వెల్లడించినట్టు తెలుస్తోంది.
Jagan
Vizag
Airport
Srinivasa Rao

More Telugu News