మన్మోహన్ సింగ్.. మిమ్మల్ని అపార్థం చేసుకున్నా!: అనుపమ్ ఖేర్
- మన్మోహన్ జీవిత ప్రయాణం నాకెన్నో నేర్పింది
- మిమ్మల్ని అపార్థం చేసుకున్నా
- చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ అపార్థం చేసుకోదు
ఈ వీడియో నిజంగా షాకింగ్‌గా అనిపిస్తోంది. అచ్చం మన్మోహన్, సోనియాలను చూస్తున్నట్టే అనిపిస్తోంది. ‘అద్భుతమైన సినిమా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ షూటింగ్ పూర్తయింది. మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు. మన్మోహన్ సింగ్ జీవిత ప్రయాణం నాకు ఎన్నో నేర్పింది. ఈ సినిమా చేయడానికి ముందు నాలో కొన్ని ఆలోచనలు ఉండేవి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నా. కానీ ఇవాళ షూటింగ్ పూర్తయిన తర్వాత, దాదాపు ఏడాది పాటు ఈ పాత్రలో జీవించిన తర్వాత నిజాయతీగా చెబుతున్నా.. చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ అపార్థం చేసుకోదు’ అని అనుపమ్ పేర్కొన్నారు.