తూచ్.. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు!: ధర్మపురి శ్రీనివాస్
- ఎంపీగా చాలా మందిని కలుస్తుంటా
- మర్యాదపూర్వకంగా రాహుల్ తో భేటీ
- సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతా
ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న డీఎస్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తో సమావేశమయ్యారు. అనంతరం తిరిగివెళుతూ మీడియాతో ముచ్చటించారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని ఈరోజు మర్యాదపూర్వకంగానే కలుసుకున్నట్లు డీఎస్ స్పష్టం చేశారు. తాను ఏం నిర్ణయాలు తీసుకుంటానో అన్నీ మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు తన రాజకీయ భవితవ్యంపై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు.