చరణ్ మూవీలో ఐటమ్ చేయనని చెప్పిన రకుల్?

  • బోయపాటితో చరణ్ మూవీ 
  • కథానాయికగా కైరా అద్వాని
  • ఐటమ్ సాంగ్ కి సన్నాహాలు
బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరోగా చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ను బాలీవుడ్ భామతో చేయించనున్నారనే టాక్ వచ్చింది.

అయితే ఈ ఐటమ్ సాంగ్ కోసం ముందుగా రకుల్ ను అడిడిగినట్టుగా సమాచారం. తెలుగులో రకుల్ కి ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఆమె కోలీవుడ్ పై దృష్టి పెట్టి తమిళ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటోంది. ఈ క్రమంలో చరణ్ - బోయపాటి సినిమా నుంచి ఐటమ్ ఆఫర్ ఆమెకి వెళ్లింది. ప్రస్తుతం తాను బిజీగా ఉన్నాననీ .. ఐటమ్ సాంగ్ చేయడం కుదరదని రకుల్ స్పష్టం చేసిందట. చరణ్ తో గతంలో రెండు సినిమాల్లో రకుల్ హీరోయిన్ గా చేసింది. అదే చరణ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం ఇష్టంలేకనే ఆమె నో చెప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      
Go Back to Shorts
charan
rakul

More Telugu News