Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందీ సినిమా రీమేక్ తో పునః ప్రవేశం చేస్తున్న నజ్రియా!

  • హిందీలో హిట్ కొట్టిన 'పింక్ '
  • తమిళ .. మలయాళ భాషల్లో రీమేక్ 
  • అమితాబ్ పాత్రలో అజిత్ 
తమిళ .. మలయాళ భాషల్లో అందాల కథానాయికగా 'నజ్రియా'కి మంచి క్రేజ్ వుంది. యూత్ హృదయాలను దోచేసిన ఆమె, వివాహం తరువాత సినిమాలకు దూరంగా వుంటూ వచ్చింది. ఫాహద్ ఫాజిల్ తో వివాహమైన ఐదేళ్ల తరువాత తిరిగి ఆమె రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. హిందీలో వచ్చిన 'పింక్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందనుంది.

అమితాబ్ - తాప్సీ ప్రధానమైన పాత్రలను పోషించిన 'పింక్' సినిమా 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి 'ఖాకి'దర్శకుడు వినోద్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. హిందీలో తాప్సీ చేసిన పాత్రకి గాను తమిళంలో నజ్రియాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక అమితాబ్ పాత్రను అజిత్ చేయనున్నాడని చెబుతున్నారు. విభిన్నమైన కథాకథనాల కారణంగా .. హీరో అజిత్ కావడం వలన .. తమిళ - మలయాళ భాషల్లో విడుదల చేయనుండటం వలన నజ్రియా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.       
nazriya
ajith

More Telugu News