యూత్ ను ఆకట్టుకుంటోన్న '24 కిస్సెస్' ట్రైలర్

  • తెరపైకి మరో ప్రేమకథా చిత్రం 
  • ఈ సినిమాపైనే హెబ్బా పటేల్ ఆశలు 
  • నవంబర్ 15వ తేదీన విడుదల
తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలు తమ జోరు చూపిస్తున్నాయి. కంటెంట్ వుంటే చాలు .. కాసుల వర్షం కురిపించేస్తున్నాయి. అలా యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిన మరో చిత్రమే '24 కిస్సెస్'. అదిత్ అరుణ్ .. హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమాకి అయోధ్య కుమార్ దర్శకుడిగా వ్యవహరించాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్ల మధ్య చోటు చేసుకునే రొమాంటిక్ సీన్స్ పై .. వాళ్ల మధ్య గొడవలపై ట్రైలర్ ను కట్ చేశారు. రావు రమేశ్.. నరేశ్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను నవంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మధ్య కాలంలో రేసులో హెబ్బా పటేల్ వెనుక పడిపోయింది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆమె వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 
Go Back to Shorts
adith arun
hebba

More Telugu News