ఆ 18 మంది ఎమ్మెల్యేలు అనర్హులే!: కీలక తీర్పిచ్చిన మద్రాస్ హైకోర్టు

  • టీటీవీ దినకరన్ కు మద్రాస్ హైకోర్టు షాక్
  • 18 మంది ఎమ్మెల్యేలపై తీర్పు వెలువరించిన న్యాయమూర్తి
  • పళనిస్వామికి పెద్ద ఊరటే
శశికళ బంధువు, అన్నాడీఎంకే బహిష్కృత టీటీవీ దినకరన్ కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తమిళనాడులో అనర్హతను ఎదుర్కొంటున్న 18 మందిపై కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ ఎమ్మెల్యేలు అనర్హులేనని తేల్చి చెప్పారు. అనర్హత వేటును సమర్థించిన న్యాయస్థానం, ఎమ్మెల్యేలంతా పదవీచ్యుతులేనని తెలిపింది.

ఈ తీర్పు ముఖ్యమంత్రి పళనిస్వామికి పెద్ద ఊరటే. కాగా, అనర్హత చెల్లబోదని తీర్పు వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న దినకరన్, తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Tamilnadu
AIADMK
Madras High Court

More Telugu News