Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దొంగ ప్రేమ.. ప్రియుడితో కలసి మరో ప్రియుడిని హత్య చేసిన యువతి!

  • ఈ నెల 20న షాద్ నగర్ లో శేఖర్ హత్య
  • కేసు విచారణలో తేలిన విస్తుపోయే నిజాలు
  • మద్యంలో నిద్రమాత్రలు కలిపి గొంతు కోసిన పర్వీన్
ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం సాగించిన ఓ యువతి, ఒకరి సాయంతో మరొకరిని హత్య చేసి, ముంబై పారిపోతూ షాద్ నగర్ పోలీసులకు పట్టుబడింది.  ఈ నెల 20న షాద్ నగర్ లో ఓ హత్య జరుగగా, కేసును విచారించిన పోలీసులు పలు విస్తుపోయే అంశాలను వెలుగులోకి తెచ్చి, నిందితులను అరెస్ట్ చేశారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఫరూక్‌ నగర్‌ మండలం గుండుగేరికి చెందిన ఈరమోని శేఖర్‌ (24), పర్వీన్‌ బేగం (18) మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. 8 నెలల క్రితం గుండుగేరికి ఉపాధి నిమిత్తం వచ్చిన తోళ్ల వ్యాపారి మహమ్మద్‌ ఆసిఫ్‌ ఖురేషీ (23)తో పర్వీన్ కు పరిచయం కాగా, అతన్ని కూడా ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని భావించిన సమయంలో, శేఖర్ విషయం ఆసిఫ్ కు తెలిసింది. ఈ విషయంలో పర్వీన్ ను నిలదీయగా, శేఖర్ తన వద్ద రూ. 4,500 అప్పు తీసుకున్నాడని, దాన్ని ఇవ్వకుండా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని అబద్ధాలు చెప్పింది. ఇద్దరూ కలసి శేఖర్ ను చంపాలని ప్లాన్ చేసుకున్నారు.

ఈ క్రమంలో 19వ తేదీ రాత్రి శేఖర్ ను తన ఇంటికి రప్పించిన పర్వీన్, మద్యంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. శేఖర్ మత్తులోకి జారుకోగానే, ప్రియుడి సాయంతో గొంతుకోసి చంపేసింది. మృతదేహాన్ని అక్కడే ఇళ్ల మధ్య పడేసి, హైదరాబాద్ కు వచ్చిన ఈ జంట, ముంబైకి పారిపోయేందుకు నిర్ణయించుకుని షాద్ నగర్ కు వెళ్లగా, శేఖర్ హత్యపై అప్పటికే కేసు నమోదు చేసి, వీరిద్దరిపై ఉన్న అనుమానంతో నిఘా పెట్టి ఉంచిన పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad
Lover
Police
Murder
Shadnagar
Shamshabad

More Telugu News