షూటింగ్ ఫీట్.. విమానం రెక్కపై నడుస్తూ కిందపడి ప్రాణాలు కోల్పోయిన సంగీతకారుడు!
- ప్రమాదకర విన్యాసాలే గుర్తింపు తెచ్చిపెట్టాయి
- ప్రమాదకర ఫీట్‌ను ఎంచుకున్న రాపర్ జాన్ జేమ్స్
- ప్యారాచూట్ తెరిచే సమయం కూడా లేదు
ఎగురుతున్న విమానం రెక్కపై నడుస్తూ తన మ్యూజిక్ వీడియోను చిత్రీకరించాలనుకున్నారు. దీనికోసం జేమ్స్ శిక్షణ కూడా తీసుకున్నారు. తాజాగా చిత్రీకరణ ప్రారంభించారు. జేమ్స్ విమాన రెక్కపై నడుస్తూ చివరి వరకూ వెళ్లారు. అదే సమయంలో విమానం కాస్తా జేమ్స్ ఉన్న వైపు ఒరగడంతో పట్టుతప్పి జారి పడిపోయారు. ప్యారాచూట్ తెరిచే సమయం కూడా లేకపోవడంతో కిందపడి ప్రాణాలు కోల్పోయారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఘటనను అక్కడి పోలీసులు కూడా ధ్రువీకరించారు.