బాలకృష్ణకి తాను అభిమానినని యంగ్ ఎన్టీఆర్ నాతో చెప్పారు: పరుచూరి గోపాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలకృష్ణకి తాను అభిమానినని యంగ్ ఎన్టీఆర్ నాతో చెప్పారు: పరుచూరి గోపాలకృష్ణ

  • పాలకొల్లులో 'అల్లరి రాముడు' షూటింగ్ 
  • ఎన్టీఆర్ తో కలిసి నేను అక్కడే వున్నాను 
  • అప్పుడు మా ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది 
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. 'అల్లరి రాముడు' సినిమా కోసం నేను .. యంగ్ ఎన్టీఆర్ .. దర్శకుడు బి.గోపాల్ .. నిర్మాత చంటి అడ్డాల 'పాలకొల్లు'లో వున్నాము.

అప్పుడు యంగ్ ఎన్టీఆర్ నాతో 'మీరు ఎన్టీ రామారావుగారికి ఎలా ఫ్యానో .. నేను మా బాబాయ్ బాలకృష్ణకి అలా ఫ్యాన్ అండీ, థియేటర్లో మా బాబాయ్ సినిమా చూస్తూ నేను కాగితాలు చింపి విసిరేస్తాను .. ఈలలు వేస్తాను' అని చెప్పాడు. 'మరి ఈ విషయం నువ్వు మీ బాబాయ్ కి ఎప్పుడూ చెప్పలేదా?' అని అడిగాను. 'ఎప్పుడూ చెప్పలేదండి .. మా బాబాయ్ అంటే నాకు భయం' అన్నాడు. 'మీ బాబాయ్ తో మాట్లాడిస్తాను వుండు' అని చెప్పి, బాలయ్య బాబు దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడించాను. అలా ఒక అభిమానిగా యంగ్ ఎన్టీఆర్ వాళ్ల బాబాయ్ తో మాట్లాడిన తొలి సన్నివేశం 'పాలకొల్లు'లో జరిగింది' అని చెప్పుకొచ్చారు.     
balakrishna
ntr
paruchuri

More Telugu News