‘లక్ష్మీస్ వీరగ్రంథం’లో ప్రధాన పాత్రలో శ్రీరెడ్డి.. ప్రకటించిన కేతిరెడ్డి!
- మళ్లీ ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పనులు ప్రారంభం
- శ్రీరెడ్డితో చెన్నైలో సంప్రదింపులు
- గతంలో శ్రీరెడ్డికి అండగా నిలిచిన వర్మ
తన సినిమాలో ప్రధాన పాత్రను శ్రీరెడ్డి పోషించనున్నట్టు కేతిరెడ్డి తాజాగా ప్రకటించారు. దీనికి కారణం వర్మేనని.. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ విషయమై శ్రీరెడ్డి చేసిన పోరాటానికి వర్మ అండగా నిలిచారని.. కాబట్టి శ్రీరెడ్డికి ప్రధాన పాత్ర ఇస్తున్నట్టు కేతిరెడ్డి తెలిపారు. ఇప్పటికే శ్రీరెడ్డితో చెన్నైలో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. త్వరలోనే ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి కేతిరెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.